కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఘరానా బుల్లోడా సినిమాలోని భీమవరం బుల్లోడ సాంగ్‌పై ఎన్టీఆర్ వైరల్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కీరవాణి ఇంటర్వ్యూ చేశారు. నా సినిమాల్లో మీకు అస్సలు నచ్చని సాంగ్ ఏమిటని ఎన్టీఆర్‌ని కీరవాణి ప్రశ్నించగా.. భీమవరం బుల్లోడ సాంగ్ నాకు నచ్చదని చెప్పేశాడు. లిరిక్స్ కారణం వల్లే అలా అనిపించిం ఉండొచ్చని వెల్లడించాడు. కాని ఈ సాంగ్ మంచి హిట్ సాధించడం గమనార్హం.