ఏపీ ప్రభుత్వంపై సినీ నటుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌పై కక్షతో ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచలేదని ఆరోపించాడు. ఏపీలో తెలుగు సినిమాలు నిషేధించి.. ప్రభుత్వమే పరిశ్రమను నడిపించుకోవాలన్నాడు. మంత్రులు వెలంపల్లి, కొడాలి నాని మంచి నటులని.. వారిని హీరోలుగా పెట్టి సినిమాలు తీయాలని వ్యాఖ్యానించాడు. ప్రభుత్వం ఇప్పటికైనా పగలు, ప్రతీకారాలకు వెళ్లకుండా సుపరిపాలన అందించాలని కోరారు.