నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ శుక్రవారం ఓ ఫోటో నెట్టింట వైరల్ అయింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల బ్లాక్ డ్రెస్‌లలో ఉన్న ఫోటోను అనేక మంది షేర్ చేశారు. గతంలో నాగచైతన్యను శోభిత ధూళిపాళ్ల గురించి మీరేం చెబుతారు అని అడగ్గా.. ‘నవ్వుకుంటాను’ అని సమాధానమిచ్చారు. శోభిత ఇప్పటి వరకూ దీనిపై స్పందించలేదు. ఇలాంటి సమయంలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటో కనిపించడంటో నెటిజన్లు వీరు పక్కాగా ప్రేమలో ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.