బారీ బ‌డ్జెట్ మూవీతో వ‌స్తున్న నాగ‌చైత‌న్య‌

© File Photo

నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది చైతూ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమా అని చిత్ర‌బృందం తెలిపింది. తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల్లో ఇది తెర‌కెక్కుతుంది. సెప్టెంబ‌ర్ మూడో వారం నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ప్రారంభమ‌వుతుంది. కృతిశెట్టి హీరోయిన్‌. ఈ సినిమాతో చై మొద‌టిసారిగా త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కానున్నాడు. ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా ఇద్ద‌రు ఈ చిత్రానికి సంగీతం ద‌ర్శ‌కులు.

Exit mobile version