‘థ్యాంక్యూ’ సినిమా జీవితంలోని వివిధ దశల గురించి ఉంటుందని నాగచైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమాలో చై 16 ఏళ్ల స్కూల్ కుర్రాడిలా, 21 ఏళ్ల యువకుడిగా, 36 ఏళ్ల వ్యక్తిలా కనిపించబోతున్నాడు. అయితే ఆయా దశల్లో ఉన్నప్పుడు విడుదలయ్యే మహేశ్ బాబు సినిమాల గురించి ఇందులో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అంతేకాదు నాగచైతన్య, మహేశ్‌బాబు ఫ్యాన్‌గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్. మాళవికా నాయర్, అవికా గోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించాడు. థ్యాంక్యూ జులై 22న థియేటర్లలో విడుదల కానుంది.
‘థ్యాంక్యూ’లో మహేశ్‌బాబు ఫ్యాన్‌గా నాగచైతన్య?
