ఒక వెబ్‌సైట్ సమంత-నాగచైతన్య గురించి రాసిన ఆర్టికల్‌పై సమంత మండిపడింది. ఇంతకీ ఆ వెబ్‌సైట్‌లో ఏం రాశారంటే నాగ చైతన్యకు, శోభితా దూలిపాళ్ల రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ సమంత టీమ్ కావాలని పుట్టిస్తుందని.. నాగచైతన్య టీమ్ వారిపై మండిపందని రాశారు. దీనిపై స్పందించిన సామ్ ..అమ్మాయిల గురించి రూమర్స్ వస్తే అవి నిజం కావొచ్చు. అదే అబ్బాయిల గురించి రూమర్స్ వస్తే అమ్మాయే వెనక ఉండి ఇలా చేయిస్తుంది అంటారు. కాస్త ఎదగండి. మేము అవన్నీ మర్చిపోయి ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నాం. మీరు ఇంకా ఆ విషయాన్ని వదిలేసి వేరే పని చూసుకోండి అంటూ ట్వీట్ చేసింది. సమంత చేసిన ట్వీట్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.