సినీ నటుడు నాగార్జున వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తానెలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని నాగార్జున చెప్పారు. రాజకీయ నాయకుడిగా కనిపించే మంచి పాత్రలు వస్తే మాత్రం నటిస్తానన్నారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఈ తరహాలోనే ప్రచారం జరుగుతోందని కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదని నాగార్జున స్పష్టం చేశారు.
విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ
