నాగార్జునసాగర్‌ 26 గేట్లు ఎత్తి నీటి విడుదల

© ANI Photo

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్‌కు భారీ వరద కొనసాగుతుండగా 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 3.37 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్‌ నుంచి దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయం నిండుకుండలా మారింది. ఏపీలో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీ వరద కొనసాగుతోంది.

Exit mobile version