TS: పుష్య మాఘ అమావాస్య రోజు ప్రారంభమైన నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు కూడా జాతరకు హాజరయ్యారు. అనంతరం నాగోబాను దర్శించుకుని అక్కడి దర్బార్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెస్రం వంశీయులు కేంద్రమంత్రికి సత్కారం చేసి నాగోబా చిత్రపటాన్ని అందించారు. మరోవైపు, 160 మంది కొత్త కోడళ్లకు మెస్రం వంశీయులు భేటింగ్ నిర్వహించారు.