భారత వాతావరణ శాఖ గురువారం దేశవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించింది. తెలంగాణలోని నల్లగొండ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు(43.5 డిగ్రీల సెల్సియస్) నమోదైన ప్రాంతంగా నిలిచిందని వివరించింది. అలాగే పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర, విదర్భ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 48 గంటలు వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.