నాని ప్రస్తుతం నటిస్తున్న దసరా మూవీ మొత్తం మాస్ లుక్ లో వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ స్పార్క్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందట. అందుకు నాని తన రెమ్యునరేషన్ ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా బడ్జెట్ పెరిగినపుడు నాని తన రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడం ఇది మొదటి సారి కాదు.