హీరో నాని ఈమధ్యకాలంలో చేసిన సినిమాలు చూస్తుంటే వరుసగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నాడు. వి సినిమా నుంచి మొదలుపెడితే.. అందులో కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత టక్ జగదీశ్ సినిమాలో ఒక ఫ్యామిలీ కోసం తపన పడే యువకుడిగా మెప్పించాడు. శ్యామ్ సింగరాయ్ రెండు డిఫరెంట్ రోల్స్..ఒకటి సినిమా కోసం ప్రయత్నిస్తున్న డైరెక్టర్‌గా, మరోవైపు శ్యామ్ సింగరాయ్ అనే బరువైన పాత్రలో నటించాడు. తాజాగా అంటే సుందరానికి సినిమాలో కామెడీతో నవ్వులు పండిస్తున్నాడు. ఆ తర్వాత వస్తున్న దసరా మూవీలో వైల్డ్ లుక్‌లో మాస్ హీరోగా అవతారమెత్తాడు. ఇలా విభిన్నమైన పాత్రలతో సైలెంట్‌గా కెరీర్లో దూసుకెళ్తున్నాడు నాని.