వ‌కీల్‌సాబ్ డైరెక్ట‌ర్‌తో స్టార్ హీరో?

Courtesy Instagram: nani

వ‌కీల్‌సాబ్ సూప‌ర్‌హిట్ కావ‌డంతో డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్‌తో సినిమాలు చేసేందుకు యువ హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే సినిమాను ప్ర‌క‌టించారు. కానీ బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ఫ 2 సినిమాతో బిజీగా ఉండ‌టంతో అది కాస్త ఆల‌స్యం కానున్న‌ట్లు తెలుస్తుంది. ఈలోపు నాని హీరోగా మ‌రో సినిమా చేసేందుకు వేణు శ్రీరామ్ సిద్ధ‌మ‌వుతున్నాడు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం నాని చేస్తున్న ద‌స‌రా మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఆ వెంట‌నే వీరిద్ద‌రి కాంబోలో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌.

Exit mobile version