సినిమా టిక్కెట్ ధరలపై మరోసారి హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరలు తగ్గించడం ప్రేక్షకులను అవమానించినట్లే అన్నాడు. కానీ ఇటీవల విడుదలైన సినిమాలకు టిక్కెట్ ధరలు భారీగా ఉండటంతో ఫ్లాప్ అయ్యాయని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు నాని అంటే సుందరానికి కూడా టిక్కెట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రేక్షకులను అవమానించినట్లేనా అని మీడియా నానిని ప్రశ్నించింది. దానికి సమాదానంగా నేను టిక్కెట్ ధరలను రూ.500 పెంచాలని అనలేదు. మరీ రూ.20, 30 అంటే సినీ ఇండస్ట్రీ నష్టపోతుందని మాత్రమే చెప్పాను .అప్పుడు అది తప్పయితే ఇప్పుడు ఇది కూడా తప్పే అన్నాడు.