నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రం నుంచి విడుదలైన మూడో పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. చంకీలా అంగిలేసి అనే పాటను బుధవారం రిలీజ్ చేశారు. ట్యూన్‌తో పాటు లిరిక్స్ అద్భుతంగా ఉండటంతో శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. మార్చి 30న పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది. ఇప్పటికే నాని ముంబయి, చెన్నైలో ప్రచారం నిర్వహిస్తున్నారు. SLV సినిమా పథాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.