తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేశ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నాడు. ఆగస్టు నుంచి ఇది ప్రారంభం కానుందని తెలుస్తుంది. మొదట టీడీపీ కంచుకోట అయిన కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది. సంవత్సరం పాటు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.