తాజాగా పెళ్లి చేసుకున్న నరేష్- పవిత్ర జంట హనీమూన్ కోసం దుబాయి వెళ్లారు. దుబాయిలోని పర్యాటక స్థలాలను కొత్త జంట వీక్షిస్తోంది. చేతుల్లో చేయి కలుపుకుని నరేష్ పవిత్ర దంపతులు న్యూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో చాలా సినిమాల్లో నరేష్- పవిత్రలు కలిసి నటించారు. హ్యాపీ వెడ్డింగ్, సమ్మోహనం, అంటే సుందరానికీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.