దిల్లీలో నేటి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు జరగనుంది. మూడ్రోజుల పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. సీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారట. దాదాపు సీఎస్‌లు అందరూ హాజరవుతారని సమాచారం. ఆయా రాష్ట్రాలకు చెందిన ఉత్తమ విధానాలను వివరిస్తారు.