నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ కార్యాలయానికి వెళ్తుండగా పార్టీ శ్రేణులు రాహుల్ వెంట ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అందుకు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో దిల్లీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో సోనియాగాంధీ కూడా విచారణకు హాజరుకావాల్సి ఉండగా..కరోనా కారణంగా ఆమె సమయం కోరారు.