నేషనల్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఢిల్లీలోని 12 ప్రాంతాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కేసుకు సంబంధించిన కీలక సాక్షాలను ఈడీ సేకరిస్తోంది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరుతో కాంగ్రెస్ నిధులు దుర్వినియోగం చేసిందని ఈడీ వారిని విచారించింది.