నవీన్ హత్య కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. నవీన్‌ను చంపుతానని నెల రోజుల క్రితమే హరిహరకృష్ణ తనకు చెప్పాడని నిందితురాలైన యువతి తెలిపింది. ఆ సమయంలో కత్తి, చేతి గ్లౌజుల్ని కూడా చూపించాడని తన వాంగ్మూలంలో పేర్కొంది. నవీన్ హత్యకు కొద్ది సమయం ముందు హరిహరతో ఫోన్‌లో మాట్లాడినట్లు అంగీకరించింది. హత్య జరిగాక మూడుసార్లు ప్రత్యక్షంగా, పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు వివరించింది. నవీన్ హత్యానంతరం శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసేందుకు తాను సహకరించినట్లు హసన్ పోలీసులకు చెప్పాడు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్