శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితో నేవీ నూతన చిహ్నం

భారత్‌ నిర్మించిన తొలి విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేవీ నూతన చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్‌కు స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వ కాలం నాటి ఆర్మీ గుర్తులనే సైన్యం వినియోగిస్తోంది. అయితే 1950 తర్వాత పలు మార్పులు చేసినప్పటికీ ఇండియన్ నేవీ జెండాలో ఎక్కువ భాగం సెయింట్‌ జార్జ్‌ క్రాస్‌ ఉండేది. కేవలం ఎడమ పక్కన మూలన భారత జెండా ఉండేది. కానీ సెయింట్‌ జార్జ్ శిలువను పూర్తిగా తొలగించి, భారతీయత ఉట్టిపడేలా నూతన గుర్తును ఆవిష్కరించారు. శివాజీ మహరాజ్‌ స్ఫూర్తితో ఈ జెండాను రూపొందించారు.

Exit mobile version