పొరుగుదేశం పాకిస్థాన్ రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇమ్రాన్ కు ఇప్పటివరకు మద్దతునిచ్చిన మరో మిత్రపక్షం కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోవచ్చు. ఈ నేపథ్యంలో పాక్ నూతన ప్రధానిగా ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు అయిన షెహబాజ్ షరీఫ్ పేరు వినిపిస్తోంది.