‘కాఫీ విత్ కరణ్ సీజన్ 7’లో మూడో ఎపిసోడ్లో సమంత, అక్షయ్ కుమార్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ స్టార్స్ ఎవరు మల్టీస్టారర్ సినిమాలకు అంగీకరించరని..వాళ్లని ఒప్పించడం చాలా కష్టమని అక్షయ్ చెప్పాడు. దీంతో సమంత మాట్లాడుతూ నేను సౌత్ సూపర్‌స్టార్ నయనతారతో కలిసి లేటెస్ట్గా ఒక సినిమా చేశాను అని చెప్పింది. దీనికి వెంటనే కరణ్ జోహార్ ఆమె నా లిస్ట్‌లో లేదు అన్నాడు. అంటే అందరికంటే పెద్ద స్టార్ సమంతనే అనే అర్థంతో చెప్పాడు కరణ్. కానీ దీనిపై నయనతార ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతపెద్ద స్టార్ నీ లిస్ట్‌లో లేదంటావా?. నీకు సొంతంగా ఎదిగేవాళ్లు అంటే ఇష్టం ఉండదు కదా. నెపోటిజంను ప్రోత్సహించే నీకు నయనతార ఎందుకు కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నా లిస్ట్‌లో ఆమె లేదు..కరణ్ జోహార్‌పై మండిపడుతున్న నయనతార ఫ్యాన్స్

Courtesy Instagram: karanjohar