చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ MS ధోని.. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లు వచ్చిన వార్తలను ధోనీ ప్రొడక్షన్ హౌస్ ఖండించింది. తమిళంలో ధోని ఓ చిత్రం నిర్మిస్తున్నాడని, అందులో నయనతార కథానాయికగా ఎంపికైందని ఇటీవల వార్తలొచ్చాయి. ఐపీఎల్ ముగియగానే ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. రజనీకాంత్‌తో సంబంధం ఉన్న సంజయ్ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తారని కూడా చెప్పారు. ఈ వాదనలను ధోనీ ప్రొడక్షన్ హౌస్ ఖండించింది. అటువంటి ప్రాజెక్ట్ జరగడం లేదని, సంజయ్ అనే వ్యక్తి గురించి తమకు తెలియదని పేర్కొంది. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రస్తుతం ఎవరితోనూ పనిచేయడం లేదని వెల్లడించింది.