నయనతార, విఘ్నేశ్ శివన్‌ల వివాహం ఈరోజు మహాబలిపురంలో ఉదయం 8.30 గంటలకు ఘనంగా జరిగింది. నిన్న సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించిన విఘ్నేశ్ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుంటున్నట్లు విఘ్నేశ్ శివన ప్రకటించారు. ఇంతకాలం నా ప్రొఫెషనల్ లైఫ్‌కు సపోర్ట్ చేసినట్లు నా పర్సనల్ లైఫ్‌కు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అని చెప్పాడు. ఈరోజు పెళ్లి తర్వాత మధ్యాహ్నం సమయంలో ఫోటోలు విడుదల చేస్తామని తెలిపాడు. జూన్ 11న నయనతారతో కలిసి మళ్లీ ప్రెస్‌మీట్ ఏర్పాటుచేస్తామని వెల్లడించాడు.