నయనతార, విఘ్నేశ్ శివన్ జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి వేడుక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందట. ఈ వీడియోకి దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణ చేయబోతున్నట్లు తెలుస్తుంది. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట తిరుమల శ్రీవారిని దర్శించుకోబతున్నారని సమాచారం. ఇటీవలే ఇద్దరు కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను పెళ్లికి ఆహ్వానించారు. అయితే వీరి పెళ్లి నిజంగానే నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పుకోవచ్చు. కానీ లైవ్ ఉంటుందా లేదా పెళ్లి మొత్తం ఒక వీడియో రూపంలో విడుదల చేస్తారో తెలియాల్సి ఉంది.