‘అంటే సుందరానికి’తో నజ్రియా ఒక్కసారి తెలుగు వారి దృష్టి తనవైపు తిప్పుకుంది. ఇదివరకే రాజా రాణి డబ్బింగ్ సినిమాతో ఆమెకు ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగా బాగా పెరిగింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నజ్రియా తనకు టాప్ హీరోయిన్ అనిపించుకోవాలని లేదని చెప్పింది. కేవలం మంచి సినిమాల్లో నటిస్తే చాలని మనసులో మాట బయటపెట్టింది. ఇక తన భర్తతో నటించడం ఇష్టమే అని చెప్పిన నజ్రియా సినిమాల్లోనూ భార్యభర్తల్లా కనిపించడంలో కొత్తదనం ఉండదని చెప్పుకొచ్చింది.