ప్రాంగణ నియామకాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వరంగల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది జరిగిన క్యాంపస్ డ్రైవ్‌లో 1016 మంది స్టూడెంట్స్ యావరేజ్‌గా రూ.14.5 లక్షల ప్యాకేజీ పొందారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న గౌరవ్ సింగ్, ప్రియాన్ష్ మహేశ్వరిలు 62.5 లక్షల వార్షిక వేతనంతో దేషా సంస్థలో ఉద్యోగం సాధించారు. అలాగే ఒరాకిల్‌లో 50 మంది విద్యార్థులు రూ.27 లక్షల నుంచి రూ.32 లక్షల ప్యాకేజీతో సెలక్డ్ అయ్యారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 250 కంపెనీలు పాల్గొన్నాయి. కొవిడ్ కారణంగా కొందరు ఆన్లైన్లో, మరికొందరు ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.