విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ ఇద్దరు సిస్టమ్ అనలిస్టులను ఢిల్లీ ఎయిమ్స్ సస్పెండ్ చేసింది. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో సైబర్ దాడి జరిగింది. సైబర్ అటాక్‌ను వీరిద్దరూ సరిగా ఎదుర్కోకపోవడంతో అప్పుడే నోటీసులు జారీ చేసింది. సైబర్ దాడి జరిగి వారమైనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వీరిపై వేటు వేసింది. కాగా ఎయిమ్స్ ఆస్పత్రిలోని కంప్యూటర్లలో డేటా రీస్టోర్ చేసినట్లు ఎయిమ్స్ తెలిపింది. సర్వర్లు మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు మరికొంత సమయం పట్టొచ్చని వివరించింది.