హైదరాబాద్- మలక్ పేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మహిళలు చనిపోయారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యపరీక్షలు నిర్వహించకుండానే ఆపరేషన్ చేశారని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.