కోచ్‌గా నెహ్రాను నియమించాలి: భజ్జీ

© ANI Photo(file)

టీ20లకు కోచ్‌గా భారత జట్టుకు ఆశిశ్ నెహ్రాని నియమిస్తే బాగుటుంటుందని మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని తక్కువ అంచనా వేయలేమని చెప్పాడు. ‘నెహ్రాను తీసుకోవాలి. అలా అని రాహుల్‌ని తక్కువ చేయట్లేదు. వీరిద్దరూ కలిసి 2024 ప్రపంచకప్‌కు మెరుగైన జట్టును తీర్చిదిద్దాలి. అలాగే టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల దృక్పథం మారాలి. తొలి 6 ఓవర్లలో ఎక్కువ పరుగులు రాబట్టాలి. రోహిత్, రాహుల్, కోహ్లీ స్ట్రైక్‌రేట్‌లను మెరుగు పరుచుకోవాలి’ అని భజ్జీ చెప్పాడు.

Exit mobile version