NETFLIXకు భారీ షాక్.. 100 రోజుల్లోపే 2,00,000 మంది యూజర్లు ఉష్

© File Photo

ప్రముఖస్ట్రీమింగ్ ప్లాట్ ఫాం NETFLIXకు భారీ షాక్ తగిలింది. గడిచిన 100 రోజుల్లోపే ఈ ప్లాట్ ఫాం నుంచి దాదాపు రెండు లక్షల మంది కస్టమర్లు వెళ్లిపోయారు. కోవిడ్ సమయంలో మంచి లాభాలను చవిచూసిన ఈ సంస్థకు ఇప్పుడు ఇలా జరగడం పెద్ద షాకే. ఈ ఏడాది మొదటి క్వార్టర్ ఫలితాలను NETFLIX ప్రకటించింది. ఈ క్వార్టర్‌లో NETFLIX ప్లాట్ ఫాంకు 221.6 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. కంపెనీ ఆదాయం కూడా 1.7 మిలియన్ డాలర్ల నుంచి 1.6 మిలియన్ డాలర్లకు పడిపోవడం గమనార్హం. కంపెనీ ఇటీవలే అకౌంట్ షేరింగ్ కోసం అదనపు రుసుమును ప్రవేశపెట్టింది.

Exit mobile version