నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీగా RRR నిలిచింది. మే 20 నుంచి ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటివరకు 45 మిలియన్ గంటల స్ట్రీమింగ్ జరిగింది. అదేవిధంగా ఈ మూవీ జీ 5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.