అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంప్యూటర్ చిప్‌ల తయారీకి కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలను చైనాకు విక్రయించకుండా నెదర్లాండ్స్ ఆంక్షలు పెట్టింది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం లిథోగ్రఫీ టెక్నాలజీని ఎగుమతి చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అటు అమెరికా సైతం యూఎస్ పరికరాలు, సాంకేతికత ఉపయోగించి చేసిన చిప్స్‌ను చైనాకు విక్రయించడంపై ఆంక్షలు పెట్టింది.