భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. నిన్నటి మ్యాచు సందర్భంగా వర్షం కురుస్తుండడంతో డగౌట్‌లో కూర్చున్న రుతురాజ్ వద్దకు ఓ గ్రౌండ్ మెన్ సెల్ఫీ కోసం వచ్చాడు. ఆ తరుణంలో రుతురాజ్ అతడికి కాస్త దూరం జరమని అర్థం వచ్చేలా ప్రవర్తించాడు. దీంతో నెటిజన్లు ఈ ఘటన మీద ఫైర్ అవుతున్నారు. నీ నుంచి ఇది ఊహించలేదని.. ఎదుటి వారికి కనీస మర్యాద ఇవ్వకుండా ఎలా ప్రవర్తిస్తావని ట్రోల్స్ చేస్తున్నారు. రుతురాజ్ ఫ్యాన్స్ మాత్రం ఇది అంత పెద్ద విషయం కాదని.. కరోనా భయం వలనే రుతురాజ్ ఇలా చేసి ఉంటాడని అంటున్నారు.