ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌కి టాలీవుడ్ బ్యూటీ సమంత హాజరయ్యారు. అయితే, ఆ ఫంక్షన్లో సమంత ధరించిన దుస్తుల వల్ల నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత దూరంగా ఉంటూ తన డ్రెస్సింగ్‌తో మరింత రెచ్చిపోతోందని కామెంట్లు చేశారు. తన వస్త్రధారణతో అందాల ప్రదర్శన చేస్తోందంటూ విమర్శిస్తున్నారు. అయితే వీటన్నింటిపై సమంత ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మనం 2022లో ఉన్నాం.. ఇప్పటికీ స్త్రీ ధరించే డ్రెస్‌ల ఆధారంగా జడ్జ్ చేయడం మానేసి, మనల్ని మనం మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టుకోలేమా ?’ అంటూ ప్రశ్నించారు.