బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ మలేషియా ఎయిర్ లైన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన లగేజీ ఢాకా చేరుకోలేదని… ఇంత చెత్త సర్వీస్ ఎప్పుడూ చూడలేదన్నాడు. “తొలుత ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ మార్చారు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన ఆహారం ఇవ్వలేదు. లగేజీ కూడా రాలేదు. 24 గంటలు వేచి చూశాము. రేపటి మ్యాచ్ కు ఎలా సన్నద్ధమవుతాను” అని అన్నాడు. దీనిపై స్పందించిన ఎయిర్ లైన్స్ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది.