అప్పట్లో మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వివాదాలు చెలరేగడంతో కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ చట్టాలపై ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గతేడాది మార్చి 19న తన నివేదికను సుప్రీంకోర్టు సమర్పించగా.. అది ఇప్పుడు బహిర్గతమైంది. కాగా, నిపుణుల కమిటీ సాగు చట్టాలకు మద్దతుగా వాటిని రద్దు చేయవద్దంటూ నివేదికలో పేర్కొంది. తాజాగా త్రిసభ్య కమిటీలోని అనిల్ ఘన్వాట్ ఈ విషయాలను వెల్లడించాడు. అప్పట్లోనే ఈ నివేదికను బయటపెట్టాలని లేఖలు రాసినా బహిర్గతం చేయలేదని పేర్కొన్నాడు. ఇప్పటికే సాగు చట్టాలు రద్దైన నేపథ్యంలో ఈ నివేదికకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం