క్రికెట్ అంపైర్లకు బీసీసీఐ కొత్తగా ఏ+ కేటగిరీ కేటాయించింది. ఇప్పటి వరకు ఉన్న ఏ,బీ,సీ,డీ కేటగిరీలతో పాటు ఏ+ కేటగిరీని కూడా చేర్చింది. ఈ ఏ+ కేటగిరీలో ఐసీసీ ఎలీట్ ప్యానెల్లో ఉన్న నితిన్ మీనన్ సహా మరో పదిమంది అంపైర్లకు చోటు కల్పించగా.. ఏ కేటగిరీలో 20 మంది. బీ కేటగిరీలో 60 మంది, సీ కేటగిరీలో 46 మంది, డీ కేటగిరీలో 11 మందికి చోటు దక్కింది. ఏ+, ఏ కేటగిరీలో ఉన్న అంపైర్లు విధులు నిర్వహిస్తే ఒక్కరోజులో రూ.40 వేలు చెల్లించనుండగా.. మిగిలిన కేటగిరీలో ఉన్న అంపైర్లకు రూ.30వేలు చెల్లిస్తారు.
అంపైర్లకు కొత్తగా ఏ+ కేటగిరీ

© ANI Photo