2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను ఏఐసీటీఈ విడుదల చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో కొత్త ఇంజినీరింగ్ కాలేజీలపై మారటోరియం విధిస్తున్నామన్నారు. అలాగే కళాశాలల్లో కొత్త కోర్సుల ప్రారంభానికి అనుమతులు పొందేందుకు ఏప్రిల్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కళాశాలను మూసి వేయాలనుకుంటే ఏప్రిల్ 29లోగా దరఖాస్తు సమర్పించాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ ఏడాది నుంచి మల్టీపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ విధానాన్ని అమలులోకి తీసుకోస్తున్నామని AICTE చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే వెల్లడించారు.