త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభం కానున్న టీ20 సీరీస్ కోసం పాకిస్తాన్ జట్టుకు పీసీబీ కొత్త కెప్టెన్‌ను నియమించింది. రెగ్యూలర్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు విశ్రాంతినిచ్చి.. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను నూతన సారథిగా ప్రకటించింది. కాగా సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, హరీష్ రవూఫ్‌లకు విరామం ఇచ్చింది. పీఎస్ఎల్‌లో దుమ్మురేపిన యంగ్ ప్లేయర్లు సయీమ్ అయూబ్, ఇహసానుల్లాలను టీ20 జట్టులోకి తీసుకుంది. వెటరన్ ప్లేయర్ ఇమాద్ వసీం చాలకాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.