ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా విశ్వభూషణ్ హరిచందన్ కొత్త జిల్లాల గురించి ప్రస్తావించారు. ఉగాదికి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కావాలంటే వికేంద్రీకరణతోనే సాధ్యమన్న ఆయన, జిల్లాలను విభజించడం ద్వారానే ఇది సాధ్యమన్నారు. ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది.