పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,745 ఆరోగ్య ఉప కేంద్రాలలో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం వీటిలోనే కొత్త వైద్యులను నియమించనున్నారు. ఎంబీబీఎస్, బీఏఎంస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 – 44 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.