GHMC పరిధిలోని కైతలాపూర్ వద్ద ఈ రోజు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ వలన ఐటీ కారిడార్ ప్రజలకు ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB)ని GHMC రూ. 86 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ ఫ్లై ఓవర్ వలన హైటెక్ సిటీ నుంచి కూకట్ పల్లి మీదుగా జెఎన్టీయూ, సనత్ నగర్, బాలానగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. 3.50 కిలోమీటర్ల దూరం కూడా కలిసిరానుంది. తమతో కేంద్రం కలిసిరాకున్నా హైదరాబాద్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
-
Courtesy Twitter:MinisterKTR
-
Courtesy Twitter:MinisterKTR