భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశవ్యాప్తంగా కోవిడ్-19 ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనలో మార్చి 31 నుంచి దేశంలో విపత్తు నిర్వహణ చట్టం అమలులో ఉండదని పేర్కొంది. కానీ, ఫేస్ మాస్క్, సామాజిక దూరం నిబంధనలు అమలులో ఉండనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 31 తర్వాత అనుసరించేబోయే తాజా మార్గదర్శకాల జాబితాను MHA విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం విద్యా సంస్థల్లో అన్ని తరగతుల వారికి ఆఫ్‌లైన్ తరగతులను పునఃప్రారంభించాలి. వివాహాలు, మతపరమైన స్థలాలు, అంత్యక్రియలకు ఎటువంటి పరిమితి లేకుండా పూర్తి సామర్థ్యంతో అనుమతి. షాపింగ్ మాల్స్, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్పాలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు మొదలైన బహిరంగ ప్రదేశాలలో పూర్తి సామర్థ్యంతో తెరుచుకోవచ్చు.