తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు థాక్రే నియమాకం అయ్యారు. ఈమేరకు ఆయన్ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉదయం టీకాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవికి మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదేక్రమంలో మాణిక్కం ఠాగూర్‌ను గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నియమించింది. మాణిక్ రావు థాక్రే గతంలో మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు.