యూపీఐ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బ్లాక్ అండ్ మల్టిపుల్ డెబిట్స్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. దీని ద్వారా సెక్యూరిటీస్ లో పెట్టుబడులు మరింత సులభం అవుతాయని పేర్కొంది. ఈ-కామర్స్ లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సేవలు డెలివరీ అయ్యే వరకు డబ్బు మన ఖాతాలోనే ఉంటుందని.. అవసరమైన సమయంలో డెబిట్ అవుతాయని ఆర్బీఐ తెలిపింది. ఇందుకు అనుగుణంగా ఎన్పీసీఐకు సూచనలు చేయనుంది.