స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో నుంచి తాజాగా ఫస్ట్ K సిరీస్ మోడల్ Oppo K10 Series ఫోన్ భారత మార్కెట్లో విడుదలయింది. మార్చి29 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. 6.59-అంగుళాల Full HD డిస్‌ప్లే, Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో వచ్చింది. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదలై ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో లభించనుంది. 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.14,990, 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.16,990తో నలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్లు విడుదలయ్యాయి. SBI క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా EMI పేమెంట్ ఆప్షన్ ద్వారా రూ. 2,000 డిస్కౌంట్, ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా బ్యాంక్ EMI పేమెంట్ ఆప్షన్ ద్వారా 1,000 డిస్కౌంట్ పొందవచ్చు.