ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తొలుత వైకుంఠ ధామం ప్రారంభించిన ఆయన అనంతరం నాచారంలోని ఎస్టీపీ ప్లాంట్ పనులకు భూమిపూజ నిర్వహించారు. బడ్జెట్ లో కేటాయించిన విధంగా పేదలకు ఖాళీ స్థలం ఉండి.. ఇల్లు కట్టుకొవాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లను కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు.